కుందూరులో స్వచ్ఛ రథం ప్రారంభం
కోనసీమ: కె.గంగవరం మండలం కుందూరు గ్రామంలో ప్రభుత్వం అందజేసిన స్వచ్ఛ రథాన్ని సొసైటీ అధ్యక్షులు జగతా రమణ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పెరిగిపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ రథం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు.