నేడు నరసన్నపేటలో జాబ్ మేళా
SKLM: నరసన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని, పది నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులన్నారు.