ఇద్దరు సిక్కులపై దాడి.. వీడియో వైరల్

బ్రిటన్‌లో ఇద్దరు సిక్కులపై ముగ్గురు స్థానిక వ్యక్తులు దాడి చేశారు. వాల్వర్‌హాంప్టన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సిక్కులను వారు కాలితో తన్నడం కనిపిస్తుంది. ఇక ఈ అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వంతో చర్చించాలని విదేశాంగమంత్రి జై శంకర్‌ను శిరోమణి అకాలీ దళ్ నేత కోరారు.