కీర్తి నగర్‌లో పర్యటించిన కార్పొరేటర్
WGL: GWMC 16వ డివిజన్ కీర్తి నగర్‌లో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ విస్తృతంగా పర్యటించారు. కాలనీలో పారిశుద్ధ్య పనులను కార్పోరేటర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిశుభ్రమైన వాతావరణం అవసరమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.