జాబ్ మేళాలో 11 మంది ఎంపిక
కోనసీమ: రామచంద్రపురంలో ఉపాధి భవన్‌లో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన జాబ్ మేళా లో 11 మంది ఎంపికైనట్లు ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. అనంతపురంలో ఉన్న కియా కంపెనీకి ఆరుగురు, గోదావరి సోలార్ కంపెనీకి ఐదుగురిని తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులను మంత్రి అభినందించారు.