గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు గోడప్రతులు ఆవిష్కరణ

తూ.గో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం రాజమండ్రిలోని జిల్లా ఛాంబర్‌లో 7వ విడత జాతీయ గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి వ్యాక్సినేటర్ రైతుల ఇంటి వద్దకే వెళ్లి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తారన్నారు.