రెవెన్యూ సదస్సుల అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి

SKLM: రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్జీల పరిష్కారం ఆలస్యం అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం అని కలెక్టర్ హెచ్చరించారు.