ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీడీవో

సత్యసాయి: పెనుగొండలో నూతన ఎంపీడీవో నరేష్ కృష్ణ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ పార్థసారధిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పెనుగొండ ఎంపీడీవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా పార్థసారధిని కలిసి పుష్పగుచ్చమిచ్చి పరిచయం చేసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని పార్థసారథి సూచించారు.