రాష్ట్రానికి చలి గండం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, దీనికి తోడు దట్టమైన పొగమంచు ఉంటుందని IMD హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాకు అధికారులు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. సాధారణం కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.