నేడు జిల్లాలో జాబ్ మేళా

MBNR: జిల్లా కేంద్రం పద్మావతి కాలనీ మన్నన్ ట్రైడర్స్ బిల్డింగ్‌లో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రి ప్రియా తెలిపారు. 550 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎస్ఎస్సీ పాస్ (ఆర్), ఇంటర్, ఐటిఐ, డిగ్రీ ఉత్తీర్ణులై, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.