శీలంవారిపల్లిలో రైతులకు జీవన ఎరువులు పంపిణీ

ప్రకాశం: రైతులు జీవన ఎరువులు వాడడం వలన పంటలు అధిక ఉత్పత్తిని సాధిస్తాయని వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. శ్రీవిద్య అన్నారు. చంద్రశేఖరపురం మండలం శీలంవారిపల్లిగ్రామంలో ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎరువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం శీలంవారిపల్లి గ్రామంలోని రైతులకు ఉచితంగా జీవన ఎరువులు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.