ఖమ్మంలో ఐదు లక్షల మందితో సీపీఐ బహిరంగ సభ

ఖమ్మంలో ఐదు లక్షల మందితో సీపీఐ బహిరంగ సభ

KMM: సీపీఐ 100 సంవత్సరాల ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. సభలో కార్మికులు, కర్షకులు, శ్రమజీవులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.