కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా

NLR:సైదాపురం తహశీల్దార్ కార్యాలయం సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధిక లోడుతో వెళ్తుండడమే ఈ ప్రమాదం కారణమని స్థానికులు వాపోతున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.