అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని గురువారం నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి హారతులతో పాటు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ఆలయ ఏఈఓ సుదర్శన్ రెడ్డి ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.