ప్రధాని ప్రసంగాన్ని వీక్షించిన జాయింట్ కలెక్టర్
సత్యసాయి: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రదాని మోదీ ప్రారంభించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళనాన్ని’ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. దేశాభివృద్ధిలో మహిళల ప్రాధాన్యత, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న నూతన అవకాశాల గురించి ప్రధాని వివరించారు.