త్వరలో అందుబాటులోకి ఎకోపార్క్: కలెక్టర్
MDK: నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన ఎకోపార్క్ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, ఆర్డీవో పాల్గొన్నారు.