ఎలమంచిలిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
AKP: ఎలమంచిలి పట్టణం కొమ్మాయి గుండం వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. 18 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.