ఒంటిమిట్టలో శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు
KDP: ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేష వాహనంపై స్వామివారి వైభవ ఊరేగింపు ఘనంగా జరిగింది. విద్యుత్ దీపాల కాంతుల్లో, భక్తుల జయధ్వానాల మధ్య జరిగిన ఈ దివ్య దర్శనం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ అధికారులు, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.