కొత్త జిల్లాలపై ఉత్కంఠ

కొత్త జిల్లాలపై ఉత్కంఠ

కృష్ణా: జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్‌ కమిటీ నివేదిక రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను విజయవాడగా మార్చి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూజివీడు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరును కృష్ణాలో, నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతి జిల్లాలో విలీనం చేయనున్నట్లు సమాచారం.