'బుర్కీలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు'

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బుర్కీ గ్రామంలో అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) సిబ్బంది డాక్టర్ సర్ఫరాజ్ ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.