పరిటాల సునీతను కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
ATP: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన వడ్డే వెంకట్ ఆదివారం ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినందుకు పరిటాల సునీత వెంకట్‌కు అభినందనలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు.