నేడు మెళియాపుట్టిలో పర్యటించనున్న మాజీ డిప్యూటీ సీఎం
SKLM: పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలంలో మాజీ డిప్యూటీ సీఎం పర్యటిస్తారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. నరసన్నపేట వైసీపీ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో భాగంగా మండలంలోని ముక్తాపురం కరజాడ భరణికోట పంచాయతీలలో పర్యటిస్తున్నారని చెప్పారు. రచ్చబండ కోటి సంతకాల సేకరణలో భాగంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.