బుచ్చి ఆటోనగర్కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి మండలంలోని నాగమాంబాపురం పంచాయతీ విలియమ్స్ పేటలో ఆటో నగర్ భూమిపూజ కార్యక్రమం జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయంలో అభివృద్ధితో పాటు సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. టీడీపీలో అందరిని ఆదుకుంటామని తెలిపారు. ఆటోనగర్ కార్మికులకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.