'నెహ్రూ రచనలు కేవలం చరిత్ర మాత్రమే కాదు'

'నెహ్రూ రచనలు కేవలం చరిత్ర మాత్రమే కాదు'

నెహ్రూ రచనలు కేవలం చరిత్ర మాత్రమే కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అవి భారత్ పురోగతికి రికార్డులు అని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని అర్థం చేసుకోవడంలో ఆ రచనలు కీలకమని వ్యాఖ్యానించారు. 'సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్‌లాల్ నెహ్రూ' 100 వాల్యూమ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.