నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. కర్నూలు నగర పరిధిలో కాలనీ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు నేరుగా వినతిపత్రం రూపంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.