VIDEO: మురికి కూపంగా మారిన ఆశ్రమ పాఠశాల ఆవరణం

VIDEO: మురికి కూపంగా మారిన ఆశ్రమ పాఠశాల ఆవరణం

ASF: బెజ్జూర్ మండల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల పరిసరాలు దుర్వాసనతో నిండిపోయాయి. పాఠశాల ప్రహరీని ఆనుకుని ఉన్న మురికి కాలువ కొన్ని నెలలుగా శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నిలిచిపోయింది. ఇది పందులకు ఆవాసంగా మారిందని, దోమలు బెడదతో విద్యార్థులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కాలువను శుభ్రం చేయించాలన్నారు.