రాష్ట్రపతి నిలయంలో అద్భుతం.. కళా మహోత్సవం
HYD: రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న కళా మహోత్సవం నగర వాసులను ఆకట్టుకుంటోంది. ఇంకా వారం రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు (మూడు రోజులు) మహోత్సవాన్ని 26 వేల మంది సందర్శించారు. నిన్న ఒక్క రోజే 9 వేల మంది వీక్షించారు. వివిధ రాష్ట్రాల కళాకారులు తయారు చేసిన కళారూపాలు, వారి ప్రదర్శనలు మైమరిపించాయి. ఇక కిచెన్ స్టూడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.