బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు: ఎస్పీ

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు:  ఎస్పీ

VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మందుబాబులను హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఇవాళ తెలిపారు. మద్యం సేవించి అల్లర్లు చేస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.