ట్రిబుల్ ఐటీ విద్యార్థి మృతహాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ

KDP: వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీ ఇంటర్ సెకండియర్ విద్యార్థి నరసింహనాయుడు మృతదేహాన్ని గురువారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై ట్రిబుల్ ఐటీ అధికారులను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.