స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని శవం లభ్యం
TPT: శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. భక్తకన్నప్ప సేతు వంతెన కింద నీటిపై శవం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా హాస్పిటలు తరలించారు. మృతుడి వయస్సు 60-65 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆయన తెల్ల చొక్కా, బ్లూ లుంగి ధరించి ఉన్నాడు.