భరించేని నొప్పితో బాలుడి మృతి

భరించేని నొప్పితో బాలుడి మృతి

MLG: స్వాతంత్య్ర దినోత్సవం రోజు వెంకటాపురం (మ) కమ్మరిగూడెంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల వివరాలు.. రెండో తరగతి చదువుతున్న తోకల నితీశ్ కుమార్ (6) శుక్రవారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. పాఠశాలకు బయలుదేరే సమయంలో అకస్మాత్తుగా నొప్పి అనిపించి కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందినట్టు డాక్టర్ వెల్లడించారు.