పిచ్చాటూరు నూతన ఎస్ఐగా రాఘవేంద్ర
TPT: ప్రభుత్వం ఎట్టకేలకు ఎస్ఐలను బదిలీ చేసింది. పిచ్చాటూరు నూతన ఎస్ఐగా బి.రాఘవేంద్ర నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం భాకరాపేటలో పనిచేస్తున్నారు. పిచ్చాటూరులో ఇప్పటి వరకు పనిచేసిన వెంకటేశ్ను శ్రీకాళహస్తి రూరల్‌కు బదిలీ చేశారు. ట్రైనీ ఎస్ఐ శ్రీనివాసులును నారాయణవనం రెగ్యులర్ ఎస్ఐగా నియమించారు. త్వరలోనే వీళ్లు బాధ్యతలు తీసుకోనున్నారు.