సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్సై
JGL: మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ హైస్కూల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎస్సై అనిల్ ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి మెరుగైన సమాజం కోసం పాటుపడాలని, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా 'అరైవ్ అలైవ్' ప్రోగ్రాం నిర్వహించి, విద్యార్థులకు డ్రంక్ & డ్రైవ్, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించారు.