విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందజేయాలి: ఎమ్మెల్యే

విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందజేయాలి: ఎమ్మెల్యే

BDK: అశ్వారావుపేట మండలంలోని అనంతారం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, పెద్దవాగు ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్థ్యం, వసతి సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.