రూ. 27 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత

రూ. 27 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అందజేత

సత్యసాయి: జిల్లాలో చోరీకి గురైన, ప్రజలు పోగొట్టుకున్న 135 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అదనపు ఎస్పీ అంకిత సురానాతో కలిసి వాటిని బాధితులకు అందజేశారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ రూ. 27 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.