తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు భర్తపై భార్య దాడి

కోనసీమ: తల్లికి వందనం డబ్బులు ఏమి చేశావని అడిగినందుకు భర్తపై భార్య దాడి చేసి గాయపరిచింది. అమలాపురంలో స్థానిక సావరం రోడ్డు నందు నివసించే పెనుమాల దుర్గాప్రసాద్ తల్లికి వందనం డబ్బులు భార్య ఖాతాలో పడ్డాయి. సోమవారం ఆ డబ్బులు ఏమి చేసావ్ అని అడిగినందుకు భర్తపై కత్తిపీటతో భార్య దాడి చేసింది. అతను తీవ్ర గాయాలతో అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.