లిక్కర్ స్కామ్.. హైకోర్టులో నేడు కీలక విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసుపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ రద్దు చేయాలంటూ.. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 6న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.