VIDEO: ప్రమాదకరంగా గుంత పడితే తంట..!
GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఓ ప్రమాదకరమైన గుంత స్థానికులను, వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లడంతో పాటు వాహనదారులు పాదచారులు గుంతలో పడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. తక్షణమే గుంతను పూడ్చి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.