గణనాధులను నిమజ్జనం చేసేందుకు పకడ్బందీ చర్యలు

WNP: వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా జిల్లాలో కొలువుదీరిన గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఈ నెల 5, 6 తేదీలలో వినాయక నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం వనపర్తి జిల్లాలోని నల్లచెరువు పరిసరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.