దగ్గుపాటి కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్టీఆర్ అభిమానులు

ATP: శ్రీనగర్ కాలనీలోని దగ్గుపాటి కార్యాలయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. జూనియర్ ఎన్టీఆర్‌ని దూషిస్తున్న ఆడియో వైరల్ అవడంతో కోపోద్రిక్తులైన అభిమానులు దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో లేరని సిబ్బంది తెలిపారు.