'బాధిత కుటుంబానికి 'కోటి' పరిహారం చెల్లించాలి'
NLG: ఓ మహిళకు నిర్లక్ష్యంగా వైద్యం చేసి, ప్రాణాన్ని బలిగొన్న కేసులో జిల్లా వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు ప్రకటించింది. నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ యాజమాన్యం బాధిత కుటుంబానికి 'కోటి' రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. చిట్యాల (M), ఆరెగూడెంకు చెందిన స్వాతి జూలై 9, 2018న ఆసుపత్రిలో చేరగా, జూలై 13న రాత్రి ఆపరేషన్ చేయగా 14న మృతి చెందింది.