ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం
అనంతపురం: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పురోహితులు మురళి తెలిపారు. కార్తీక మాసం చివరిదినం అమావాస్య సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపారాధన చేసి మొక్కులు తీర్చుకోవాలన్నారు.