విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీవో

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీవో

SRCL: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో రాధ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఎంపీడీవో రాధ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులను, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనo చేశారు.