'తాత్కాలికంగా గుంతలు పూడుస్తాం'
PPM: పార్వతీపురం నుండి కోరాపుట్ వెళ్లే అంతరాష్ట్ర రహదారిలో తాత్కాలికంగా గుంతలను పూడుస్తామని ఆర్అండ్‌బి సెక్షన్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు బి.రాజేంద్రకుమార్ తెలిపారు. ఈనెల 20న వచ్చిన కథనానికి మంగళవారంపై విధంగా స్పందించారు. పార్వతీపురం నుండి అంతరాష్ట్ర రహదారి విస్తీర్ణ నిమిత్తం నిధులు మంజురైనట్లు ఆయన చెప్పారు.