HYDకు మెస్సీ.. సీఎం రేవంత్ ట్వీట్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 'GOAT Tour to India 2025'లో భాగంగా DEC 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, మెస్సీకి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అతడికి ఆతిథ్యం ఇవ్వడానికి HYD సిద్ధంగా ఉందని చెప్పారు. మెస్సీ లాంటి లెజెండ్‌ను మన గడ్డపై చూడటం ప్రతి ఫుట్‌బాల్ అభిమాని కల అని 'X'లో ట్వీట్ చేశారు.