VIDEO: జలమయంగా మారిన ప్రధాన రహదారి

VIDEO: జలమయంగా మారిన ప్రధాన రహదారి

WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి నుంచి హాత్య తండాకు వెళ్లే ప్రధాన రహదారి వర్షపు నీటితో జలమయంగా మారింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ప్రయాణాలు సాగించవలసి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రతినిత్యం ఇదే పరిస్థితి నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు.