లింగసముద్రం MEO-1గా మాల్యాద్రి బాధ్యతలు

NLR: లింగసముద్రం మండల విద్యాశాఖాధికారి-1గా కనుపర్తి మాల్యాద్రి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కొండపి గవర్నమెంట్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాల్యాద్రిని ఎంఈవో-1 గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంపీడీవో కట్టా శ్రీనివాసులు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. పలువురు ఉపాధ్యాయులు, టీచర్స్, యూనియన్ లీడర్లు ఆయనకు అభినందనలు తెలిపారు.