గుండ్లకమ్మ వాటర్ స్కీంను పరిశీలించిన కమిషనర్

ప్రకాశం: అద్దంకి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే గుండ్లకమ్మ వాటర్ స్కీంను మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ డి. రవీంద్ర పరిశీలించారు. గుండ్లకమ్మ నదిలో నీటి నిల్వలను పరిశీలించి, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీటిని శుద్ధి చేసి ఓవర్‌హెడ్ ట్యాంకులకు ఎక్కించాలని సిబ్బందికి సూచించారు.