'జిల్లాలో 15 మంది పోలీసు సిబ్బందికి బదిలీలు'
సత్యసాయి: జిల్లాలో 15 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సతీశ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఒక ఏఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, 11 మంది కానిస్టేబుల్స్ ఉన్నారని పేర్కొంటూ, వీరు కొత్తగా కేటాయించిన స్థానాల్లో మూడు రోజుల్లోగా హాజరై బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.