చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏసీపీ

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఏసీపీ

JN: పాలకుర్తి మండలంలోని బొమ్మెర గ్రామ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబాటి నరసయ్య ప్రారంభించారు. అనంతరం పోతన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏసీపీ మాట్లాడుతూ.. యువత కలిసికట్టుగా ఉంటూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే మంచి పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దూలం పవన్ కుమార్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.